APSPDCL కు జాతీయ అవార్డులు

- January 11, 2026 , by Maagulf
APSPDCL కు జాతీయ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) కు జాతీయస్థాయిలో ఐదు అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IPPAI) ఆధ్వర్యంలో 26వ వ్యవస్థాపకుల, విధాన రూపకర్తల జాతీయ సదస్సు జరిగింది.

ఈ సదస్సులో భాగంగా థర్మల్ పవర్ జనరేషన్, గ్రీన్ హైడ్రోజన్ కు ప్రోత్సాహం, స్మార్ట్ మీటరింగ్ అమలు, రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం, ఎలక్ట్రిక్ వాహనాలకు కు ప్రోత్సాహం అంశంలో జాతీయ స్థాయిలో ఎస్పీడీసీఎల్ అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు సదస్సు తీర్మానించింది.

ఈ మేరకు శనివారం రాత్రి జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తరఫున సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ ఐటి) పి. అయూబ్ ఖాన్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపిపీఏఐ) ప్రతినిధులతోపాటు కేంద్ర ఇంధన శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మెహతా, ఎంఈఆర్సి చైర్ పర్సన్ సంజయ్ కుమార్ ల చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. జాతీయస్థాయిలో ఎస్పీడీసీఎల్ ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల సంస్థ ఉద్యోగులు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎండీ శివశంకర్ మాట్లాడుతూ ఈ అవార్డుల స్ఫూర్తితో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది అత్యుత్తమ పనితీరును కనబరచడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను సాధించాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com