సాహసాల ప్రయాణం ఏ రీతిన సాగింది?
- July 28, 2016
అ తను సాదాసీదా కుర్రాడు. అందరిలానే కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకొందామనుకొన్నాడు. దాంతో పాటు ఆ వయసులో చేయాల్సిన అల్లరినీ వదల్లేదు. జీవితమంతా ఇలానే సాఫీగా సాగిపోతుందని భావించాడు. కానీ ఒక్కసారిగా విధి అతని జీవితంతో ఆడుకోవడం మొదలెట్టింది. ఆశలన్నీ ఆవిరయ్యాయి. కానీ పోరాటం మాత్రం ఆపలేదు. ఇంతకీ ఆ కుర్రాడి లక్ష్యమేంటి? అతని ప్రయాణం ఏ రీతిన సాగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చూడాల్సిందే. నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా నటించిన చిత్రమిది. గౌతమ్ మేనన్ దర్శకుడు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ''గౌతమ్ మేనన్, నాగచైతన్య, ఏఆర్ రెహమాన్ కలయిక ఎంత మ్యాజిక్ చేసిందో చెప్పక్కర్లేదు. 'ఏ మాయ చేసావె'లానే ఈ చిత్రం కూడా అందరి అంచనాలనూ అందుకొంటుంది. వినోదం, యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలూ, మంచి సంగీతం మేళవించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంద''న్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







