DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- January 20, 2026
దోహా: ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (QNCC)లో తొమ్మిదవ ఎడిషన్ దోహా ఇంటర్నేషనల్ మారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (DIMDEX 2026) ను అమీర్ హెచ్.హెచ్. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ప్రారంభించారు. ఖతార్ సాయుధ దళాలు, స్థానిక మరియు అంతర్జాతీయ స్థాయిలో వాటి మిషన్లను హైలైట్ చేసే డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం స్థానిక మరియు అంతర్జాతీయ కంపెనీలు ప్రదర్శించిన సముద్ర రక్షణ మరియు భద్రతా రంగంలో తాజా టెక్నాలజీని, ఆధునాతన పరికరాలను వీక్షించారు. ఈ ప్రదర్శనలలో నావికా నౌకానిర్మాణం, కమ్యూనికేషన్లు, రాడార్, మిస్సైల్స్, సముద్ర గనులు, సైబర్ భద్రత, పైరసీ నిరోధక కార్యకలాపాలు, ఏఐ మరియు సైనిక రక్షణ రంగంలోని ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన అధునాతన వ్యవస్థలను పరిశీలించారు. పలువురు మంత్రులు, సీనియర్ భద్రతా మరియు సైనిక అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







