అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- January 23, 2026
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి చేదు వార్త చెప్పబోతోంది. సంస్థలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును వేగవంతం చేసే క్రమంలో..వచ్చే వారం నుంచే ఉద్యోగ కోతలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో చేపట్టిన ప్రక్షాళన కొనసాగింపుగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.
అమెజాన్ లేఆఫ్స్ 2026- వచ్చే మంగళవారం నుంచే ప్రారంభం?
2025 అక్టోబరు నెలలో అమెజాన్ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో ప్రకటించిన 30,000 ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. మిగిలిన కోతలను వచ్చే మంగళవారం నుంచే అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విడతలో కూడా సుమారు 14,000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
అమెజాన్ లేఆఫ్స్ 2026- ఏయే విభాగాలపై ప్రభావం ఉండవచ్చు?
తాజా సమాచారం ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్‌లోని కీలక విభాగాలపై పడనుంది:
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)
రిటైల్ విభాగం
ప్రైమ్ వీడియో
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్ - పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ)
అయితే, ఈ కోతల పరిధి ఎంత ఉంటుంది? అనేది ఇంకా ఒక స్పష్టతకు రాలేదని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
అమెజాన్ లేఆఫ్స్ 2026- కారణం ఏంటి?
సాధారణంగా కంపెనీలు ఆర్థిక భారంతో ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ మాత్రం లేటెస్ట్ లేఆఫ్స్‌కి భిన్నమైన కారణం చెబుతున్నారు.
"ఈ ఉద్యోగ కోతలు కేవలం ఆర్థిక కారణాల వల్లనో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్లనో చేస్తున్నవి కావు. కంపెనీలో అవసరానికి మించి మేనేజ్‌మెంట్ లేయర్స్ పెరిగిపోయాయి. దీనివల్ల పనిలో జాప్యం జరుగుతోంది. వీటిని తగ్గించి కంపెనీ సంస్కృతిని కాపాడటమే మా లక్ష్యం," అని జస్సీ స్పష్టం చేశారు.
గతంలో 2022 చివరలో, 2023 ప్రారంభంలో అమెజాన్ సుమారు 27,000 మందిని తొలగించింది. ఇది ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్. ప్రస్తుతం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.8 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో ఎక్కువ మంది వేర్‌హౌస్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో పనిచేస్తున్నారు.
తాజా అమెజాన్ లేఆఫ్స్ 2026 కేవలం కార్పొరేట్ (వైట్ కాలర్) ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కార్పొరేట్ విభాగంలో ఉన్న 3.5 లక్షల మందిలో సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
పాత విడతలో తొలగించిన ఉద్యోగులకు ఇచ్చిన 90 రోజుల గడువు ముగియనుండగానే, కొత్త విడత లేఆఫ్స్ వార్తలు రావడం అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత







