దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!

- January 23, 2026 , by Maagulf
దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
దుబాయ్: దుబాయ్ జనాభా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. 2024 అక్టోబర్ నాటికి కొత్తగా 1.34 లక్షల మంది చేరగా, 2025 మధ్య నాటికి మొత్తం జనాభా సుమారు 39.5 లక్షలకు (3.95 మిలియన్లు) చేరుకుంది. ఇంత భారీ జనాభాను గమ్యస్థానాలకు చేర్చడం సాధారణ విషయం కాదు. కేవలం రోడ్లు, భవనాలు కడితే సరిపోదు.. అందుకే దుబాయ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆటోమేషన్ (Automation) వంటి అత్యాధునిక టెక్నాలజీని నమ్ముకుంది.
 
కాంక్రీట్ కాదు..కనెక్టివిటీ ముఖ్యం
పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి దుబాయ్ ప్రభుత్వం కేవలం కాంక్రీట్ నిర్మాణాలపైనే ఆధారపడటం లేదు. మెటల్ రైళ్లు మరియు రోడ్లను తెలివైన, వేగవంతమైన నెట్వర్క్లుగా మార్చే 'స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' పై దృష్టి పెట్టింది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలుగుతున్నారు.
 
దుబాయ్ మెట్రో: ప్రపంచానికే ఆదర్శం
ఈ సాంకేతిక విప్లవానికి 'దుబాయ్ మెట్రో' (Dubai Metro) ఒక నిలువెత్తు నిదర్శనం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్ రహిత (Driverless) రైలు వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
పీక్ అవర్స్ (Peak Hours): రద్దీ సమయాల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది.
సామర్థ్యం: రెడ్ లైన్ (Red Line) మార్గంలో గంటకు ఒక దిశలో ఏకంగా 25,720 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సామర్థ్యం దీని సొంతం.
వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే!
దుబాయ్ మెట్రో విజయం వెనుక 'థేల్స్ రైల్ సిగ్నలింగ్ సొల్యూషన్స్' (Thales) వారి SelTrac IS అనే అధునాతన టెక్నాలజీ ఉంది.
ఇది GoA4 ఆటోమేషన్ స్థాయిని కలిగి ఉంది. అంటే ఇది అత్యున్నత స్థాయి ఆటోమేషన్; ఇందులో మనుషుల ప్రమేయం అస్సలు ఉండదు.
రైళ్లు మరియు ట్రాక్ పరికరాల మధ్య నిరంతర కమ్యూనికేషన్ ఉంటుంది. దీనివల్ల రైలు వేగాన్ని డైనమిక్గా మార్చడం, ఖచ్చితమైన పొజిషనింగ్లో రైలును నడపడం సాధ్యమవుతుంది.
జనాభా ఎంత పెరిగినా, దుబాయ్ తన రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్-గ్రేడ్ చేస్తూ, ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని స్మార్ట్ రవాణా సేవలను దుబాయ్ అందించనుంది.
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com