OTTలో సూపర్ హిట్ మూవీ ‘ఛాంపియన్’..
- January 24, 2026
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మాత స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ సినిమా. అయితే, అదే రోజున మరో 4 సినిమాలు కూడా విడుదల కావడంతో ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది ఈ మూవీ. అయినా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే, తాజాగా ఛాంపియన్(Champion OTT) సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
ఛాంపియన్ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 29 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో, ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, చాలా మంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడటం మిస్ అయ్యారు. కాబట్టి, ఛాంపియన్ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







