స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- January 28, 2026
దోహా: ఖతార్ లో ఆరోగ్య చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన ఒక ప్రైవేట్ రంగ ఆరోగ్య సముదాయంలోని డెర్మటాలజీ మరియు లేజర్ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. స్పెషలిస్ట్ డాక్టర్ లేకుండా డెర్మటాలజీ మరియు లేజర్ విభాగాన్ని నడపడం, రోగులకు లేజర్ సెషన్లు నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపింది. అలాగే, దేశం వెలుపల ఉన్నప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ స్టాంప్‌ను అక్రమంగా ఉపయోగించడం వంటి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నది. ఉల్లంఘనకు పాల్పడిన ఆరోగ్య సంరక్షణ నిపుణులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు వద్దనే సేవలు పొందాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







