అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- January 28, 2026
రియాద్: ఇరాన్‌పై ఏదైనా సైనిక చర్యలకు సౌదీ గగనతలం లేదా భూభాగాన్ని ఉపయోగించడాన్ని తిరస్కరిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా సౌదీ అరేబియా వైఖరిని తెలియజేసారు.
ఇరాన్‌లో ఇటీవలి పరిణామాలను, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరియు అణు ఫైలుకు సంబంధించిన తాజా చర్చలను పెజెష్కియన్ క్రౌన్ ప్రిన్స్‌కు వివరించారు. ఇరాన్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంలో సౌదీ అరేబియా దృఢ వైఖరిని ఇరాన్ అధ్యక్షుడు ప్రశంసించారు. దీంతో ఇరాన్ పై ముప్పేట దాడి చేయాలనే అమెరికా ఆశలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ చెక్ పెట్టినట్టు అయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







