యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- January 28, 2026
యూఏఈ: యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్ ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE) ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో భాగంగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్‌లు ఫేస్ లేదా పామ్ బయోమెట్రిక్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కాగా, యూఏఈ వ్యాప్తంగా అమలు చేసే విషయంలో సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇవ్వలేదు.
బయోమెట్రిక్ పేమెంట్స్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ లావాదేవీల భద్రతను పెంచుతాయని సెంట్రల్ బ్యాంక్ లోని బ్యాంకింగ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ గవర్నర్ సైఫ్ హుమైద్ అల్ ధహేరి తెలిపారు. ఆర్థిక సంస్థలు సాంప్రదాయ చెల్లింపు పద్ధతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నందున డిజిటల్ వాణిజ్యంలో బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రముక పాత్ర పోషిస్తాయని నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురాత్ కాగ్రి సుజర్ అన్నారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







