హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- February 13, 2026
కువైట్: హవాలీ ప్రాంతంలోని సరైన లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఒక వైద్య కేంద్రాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సీజ్ చేసింది. ఈ తనిఖీలను నేర పరిశోధన విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు లైసెన్సింగ్ విభాగం, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించారు.
కేవలం డెర్మటాలజీ క్లినిక్‌గా పనిచేయడానికి మాత్రమే లైసెన్స్ తీసుకొని ఇతర వైద్య సేవలను అందిస్తున్నారని అథారిటీ పేర్కొంది. మహిళలు మరియు మెటర్నిటీ క్లినిక్, డెంటల్ క్లినిక్ మరియు హెయిర్ కేర్ చికిత్స మరియు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సేవలు సహా అనేక ఇతర లైసెన్స్ లేని వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విచారణ అధికారులు గుర్తించారు. ఈ రైడ్స్ లో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడిగా తనిఖీలు కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







