సినిమా రివ్యూ: ‘ఫంకీ’.!
- February 13, 2026
సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో విశ్వక్సేన్. కానీ ‘లైలా’ సినిమాతో ఓ ప్రయోగం చేశాడు. కానీ ఫలించలేదు. ఇప్పుడు ‘ఫంకీ’ అంటూ రీల్ లైఫ్ దర్శకుడిగా మరో ప్రయోగానికి తెర లేపాడు. ట్రైలర్ చూస్తే ఓ మోస్తరు అంచనాలు వచ్చాయ్ ఈ సినిమా మీద. అన్నింటికీ మించి ‘జాతిరత్నాలు’ వంటి ఓ చిన్న సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఆ అంచనాల్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయ్. మరి ఆ అంచనాల్ని ‘ఫంకీ’ అందుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
కోమల్ (విశ్వక్సేన్) ఓ యంగ్ డైరెక్టర్. ‘మంచి ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ నుంచి ‘ఫంకీ’ అనే ఓ సినిమాని తెరకెక్కించే ఆఫర్ కొట్టేస్తాడు. 4 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసేస్తానంటూ ప్రగల్భాలు పలికి 40 కోట్ల బడ్జెట్‌కి తేలుస్తాడు. ఇంతా చేసి ఆ సినిమాని పూర్తి చేయలేడు. దాంతో నిర్మాత సుదర్శన్ (నరేష్) ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో జాయిన్ అవుతాడు. సుదర్శన్ కూతురు చిత్ర (కయాదు లోహర్) ఎంట్రీ ఇస్తుంది. ఎలాగైనా ఆగిపోయిన సినిమాని పూర్తి చేస్తానంటూ రంగంలోకి దిగుతుంది చిత్ర. కేవలం కోటి రూపాయల బడ్జెట్లోనే సినిమాని పూర్తి చేయాలని కోమల్ నుంచి మాట తీసుకుంటుంది. 40 కోట్లు ఖర్చయినా పూర్తి కాని సినిమా కోటి రూపాయల్లో పూర్తయ్యిందా.? ఈ క్రమంలో కోమల్, చిత్రల మధ్య ప్రేమ ఎలా చిగురించింది.? వీరి మధ్యలోకి వచ్చిన జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటీ.? ఇవన్నీ తెలియాలంటే ‘ఫంకీ’ సినిమా తెరపై చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
విశ్వక్ సేన్ మంచి నటుడే. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు.. అది అందరికీ తెలిసిందే. కానీ, ఎందుకో ఈ సినిమాలో కోమల్ అనే దర్శకుడి క్యారెక్టర్ విశ్వక్సేన్కి సరిగ్గా సూట్ కాలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అయినా కానీ, తన వంతు ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసేందుకే ప్రయత్నించాడు విశ్వక్ సేన్.. కానీ కథలో అంత పస లేకపోతే హీరో మాత్రం ఎంతని చేయగలడు అదీ పరిస్థితి. ఇక హీరోయిన్ కయాదు లోహర్కీ మంచి ప్రాధాన్యత వున్న పాత్రే దక్కింది. అందంగా కనిపిస్తూ.. తన పాత్రకి స్కోప్ వున్నంత మేర న్యాయం చేసింది. నరేష్ పాత్రని పెద్దగా వాడలేదు. ఈశ్వరీ రావు క్లైమాక్స్ లో తల్లిగా సెంటిమెంట్ పండించింది. కానీ, అంత వర్కవుట్ అవ్వలేదు. సంపత్ రాజ్, వీటీ గణేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. అన్నట్లు గెస్ట్ రోల్స్‌లో అనుదీప్, కళ్యాణ్ శంకర్ల. ఏదో నవ్వించేద్దామన్న తాపత్రయంతో వచ్చారు. కానీ, అలా వచ్చి ఇలా వెళ్లారు. నవ్వుల పాలయ్యారంతే.
సాంకేతిక వర్గం పనితీరు:
అనుదీప్ సినిమా అంటేనే కథ, కాకరకాయ్తో పని లేదు. తన స్టైల్ డైలాగ్ డెలివరీ.. క్యారెక్టర్స్‌లోని జెన్యూనిటీ, ఇన్నోెసెన్స్.. ఇలా వీటినే తన అస్త్రాలుగా వాడి సినిమాని సక్సెస్ చేసేస్తాడన్న ఓ పిచ్చి నమ్మకం ఒకటి ప్రేక్షకుల్లో బలంగా నాటుకుంది. కానీ, ఆ స్ట్రాటజీ ‘ఫంకీ’కి వర్కవుట్ అవ్వలేదని హండ్రెడ్ పర్సంట్ చెప్పేయొచ్చు. ఓ సినిమాని ప్రేక్షకుడు ఇష్టపడాలంటే, ఒకటి హృద్యమైన కథయినా వుండాలి. రెండు ఆకట్టుకునే డైలాగ్స్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయినా వుండాలి. కానీ, ఆ రెండూ ఈ సినిమాకి మైనస్ కావడమే ఈ సారి అనుదీప్ డైరెక్షన్ స్పెషాలిటీ. అనుదీప్ స్టైల్ కామెడీని ప్రేక్షకుడు ఫుల్లుగా ఊహించుకుని వెళితే, బొక్క బోర్లా పడాల్సిందే. భూతద్దం వేసినా ఆ టైమింగ్ కామెడీ కనిపించదంతే. ఇక, ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా చాలా దారుణం. కొన్ని కొన్ని సీన్లయితే.. ఆయా సిట్యువేషన్స్‌లో ఎందుకొస్తున్నాయా.? అని బుర్ర పీక్కోవాల్సిన పరిస్తితిలో ఆ కాసేపూ ప్రేక్షకుడు విసిగిపోతాడు. క్లైమాక్స్‌లో తల్లి సెంటిమెంట్, హీరో, హీరోయిన్ల లవ్ ప్రపోజల్స్ ఒకింత ఎఫెక్టివ్‌గా అనిపించిన.. సినిమా విజయానికి అవేమంత బలం కావనచ్చేమో. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అయితే వున్నతంగానే వున్నాయ్. మిగిలిన సాంకేతిక వర్గం సోఅండ్ సో..!
ప్లస్ పాయింట్స్:
విశ్వక్సేన్ పర్ఫామెన్స్, కయాదు లోహర్ అందం, క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాలు.. అక్కడక్కడా నవ్వించే కొన్ని కామెడీ సీన్స్..
మైనస్ పాయింట్స్:
బలమైన కథ లేకపోవడం.. వీకెస్ట్ నెరేషన్.. దారుణంగా ఫెయిలైన ఎడిటింగ్, అస్సలు ఎంటర్టైన్ చేయని కామెడీ మొదలైనవి.
చివరిగా:
విశ్వక్సేన్ ‘ఫంకీ’ నవ్వులే లేని కామెడీ మూవీ.!
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!









