దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- February 16, 2026
దోహా: 18వ ఖతార్ రోబోటిక్స్ మరియు AI కాంపిటిషన్ ఆదివారం దోహాలో ప్రారంభమైంది. ఈ కాంపిటిషన్ ను ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) సహకారంతో ఖతార్ సైంటిఫిక్ క్లబ్ (QSC) , యూత్ మరియు స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. లుసైల్ మల్టీపర్పస్ హాల్లో జరిగిన ఈ రెండు రోజుల పోటీలో దేశవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాలపై ఆసక్తి ఉన్న స్కూల్స్ నుంచి యూనివర్సిటీ వరకు స్టూడెంట్స్ పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకలో క్రీడలు మరియు యువత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ యాసిర్ బిన్ అబ్దుల్లా అల్ జమాల్, వివిధ విభాగ డైరెక్టర్లు మరియు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రోబోటిక్స్, ప్రోగ్రామింగ్ మరియు AI లలో పాల్గొని నేర్చుకోవడం ద్వారా స్టుండెట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు నాల్గవ పారిశ్రామిక విప్లవంలో వేగవంతమైన పరిణామాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నట్లు స్పోర్ట్స్ మరియు యూత్ మంత్రిత్వ శాఖలో యువజన వ్యవహారాల విభాగం డైరెక్టర్ ఫవాజ్ అబ్దుల్లా అల్ ముసాయిఫ్రి తెలిపారు. ఇటువంటి వార్షిక టోర్నమెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







