కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- February 16, 2026
తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మొత్తం 7 చోట్ల ఎన్నికలు జరగ్గా అందులో 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. సీపీఐ, బీజేపీ పార్టీలు చెరో కార్పొరేషన్‌పై తమ జెండా ఎగురవేసుకున్నాయి. మరోవైపు.. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినప్పటికీ హంగ్ ఏర్పడిన కారణంగా 11 పురపాలికల్లో ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. మిగిలిన వాటిలో చాలా వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ఎ న్నికయ్యారు. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ హస్తగతమైంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌గా మమత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా సురేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ దక్కించుకుంది. రామగుండం మేయర్‌గా 46వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా 57వ డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్యను ఎన్నుకున్నారు. నల్గొండ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. నల్గొండ కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్‌గా బుర్రి చైతన్య రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ హస్తగతమైంది. తొలి మేయర్‌గా ధర్ణి మధు ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా రమ్యను ఎన్నుకున్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







