'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- February 16, 2026
దుబాయ్: ప్రముఖ ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లా మృతి చెందడం పట్ల దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రిగా ఉన్న షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. శుక్లాను 'అత్యంత విశ్వాసపాత్రులైన మరియు అంకితభావం కలిగిన దేశభక్తులలో ఒకరు' అని పేర్కొంటూ ఒక వీడియో నివాళి అర్పించారు.
రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన రమేష్ శుక్లా ఫిబ్రవరి 15న 87 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. 1971లో యూనియన్ హౌస్‌లో యూనియన్ ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా ఏడు ఎమిరేట్ల పాలకులను ఆయన తన కెమెరాలో బంధించి చారిత్రక ఘట్టంలో భాగమై ప్రాచుర్యం పొందారు.
"యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయాణాన్ని మరియు దాని తొలి ప్రారంభాలను తన దృష్టితో నమోదు చేసిన రమేష్ శుక్లా కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని షేక్ హమ్దాన్ తన ఫోస్ట్ లో తెలిపారు.
యూఏఈ చరిత్రలో కీలకమైన క్షణాలను మన కోసం మరియు భవిష్యత్ తరాల కోసం సంరక్షించడంలో శుక్లా ముఖ్యమైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. 1965లో యూఏఈకి వచ్చిన ఫోటోగ్రాఫర్, యూఏఈ నేలను తన నేలగా భావించారని పేర్కొన్నారు . ఆరు దశాబ్దాల పాటు యూఏఈ చరిత్రను తన దృష్టితో చూపించారని షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







