ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- February 20, 2026
లండన్: బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన సంక్షోభంలో మునిగిపోతోంది. అమెరికాలోని అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 66 ఏళ్ల మాజీ యువరాజు ఆండ్రూను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆధునిక బ్రిటీష్ చరిత్రలో రాజకుటుంబానికి చెందిన ఒక ముఖ్య వ్యక్తిని ఇలా అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అరెస్ట్ అయిన ఈయన సాయంత్రానికి విడుదల కూడా అయ్యారు. గురువారం రోజు ఆండ్రూ 66వ పుట్టినరోజు. సరిగ్గా అదే రోజు ఉదయం 8 గంటలకు పోలీసులు సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన విండ్సర్ ప్యాలెస్‌లో గడిపిన ఆండ్రూ.. ఇప్పుడు పోలీసు కారు వెనుక సీట్లో దిక్కులు చూస్తూ కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఆయన నివాసమే కాకుండా గతంలో ఆయన ఉన్న ‘రాయల్ లాడ్జ్’లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైళ్లలో ఈయన పేరు కూడా ఉంది. ముఖ్యంగా ఆండ్రూ బ్రిటన్ వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో.. జెఫ్రీ ఎప్స్టీన్కు అత్యంత రహస్యమైన దౌత్య పత్రాలను పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2010లో ఆసియా దేశాల పర్యటనకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ నివేదికలను కూడా ఆయన ఎప్స్టీన్తో పంచుకున్నట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. వీటితో పాటు వర్జీనియా గిఫ్రే అనే మహిళ.. తాను మైనర్‌గా ఉన్నప్పుడు ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. రాజు చార్లెస్ తన తమ్ముడిని ఇప్పటికే రాజ పదవుల నుంచి తొలగించారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వరకూ వెళ్లడంతో.. రాజకుటుంబం దీనిపై పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







