డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్..
- February 20, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్స్ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. అంతేకాదు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పలు దేశాల నుంచి సుంకాల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందే అని కూడా తేల్చి చెప్పింది. టారిఫ్స్ విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం.. చట్ట విరుద్ధం అని కోర్టు వ్యాఖ్యానించింది.
1977 ఫెడరల్ చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారన్న యూఎస్ సుప్రీంకోర్టు.. భారత్ పై విధించిన 18శాతం సుంకాలు కూడా చెల్లవని చెప్పింది. కేసు విచారించిన 9మంది న్యాయమూర్తుల బెంచ్ లో ట్రంప్ విధించిన సుంకాలను ఆరుగురు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుతో యూఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు తన దగ్గర ప్లాన్ బి ఉందంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించింది మొదలు ట్రంప్ రెచ్చిపోయారు. తన మాట వినని దేశాలను భయపెట్టేందుకు, తన దారికి తెచ్చుకునేందుకు టారిఫ్స్ బాంబ్ పేల్చారు. భారత్ సహా పలు దేశాలపై భారీగా సుంకాల మోత మోగించారు. సుంకాల పేరుతో పలు దేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు ట్రంప్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







