'నేను రెడీ' షూటింగ్ పూర్తి
- February 20, 2026
యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ'. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. నిన్న రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూట్ చేశారు. ఈరోజుతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
ఈ సినిమా త్రినాధ రావు నక్కిన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా " నేను రెడీ " ని సిద్ధం చేస్తున్నారు.
హీరో హవిష్ కెరీర్ లో నేను రెడీ అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా ఉండబోతోంది. షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ తారాగణం ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధంగా వున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్టార్ కాస్ట్ వున్న సినిమా 'నేను రెడీ' కావడం విశేషం.
స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. నిజార్ షఫీ డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







