కొత్త వెబ్ సిరీస్ తో ‘మీనా’
- February 21, 2026
వెండితెర పై అలరించిన నటి మీనా, ఇప్పుడు ఓటిటి (OTT) వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ ఈ నెల 27వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మీనా తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, మారుతున్న కాలం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ రోజుల్లో పండుగలను కూడా జరుపుకోలేనంత బిజీగా ఉండేవారట. అందరూ సరదాగా పండుగ జరుపుకుంటుంటే, నేను షూటింగ్ సెట్లో మేకప్‌తో ఉండాల్సి వచ్చేది. చాలాసార్లు పండుగలకు దూరమయ్యానని బాధపడేదాన్ని. కానీ మా అమ్మ చెప్పిన మాట నాలో ధైర్యాన్ని నింపింది. ‘పండుగ ఎవరైనా చేసుకుంటారు, కానీ వందల మందితో కలిసి పని చేసే అవకాశం కొందరికే దక్కుతుంది’ అని అమ్మ అనేవారు. ఆ తర్వాత నుంచి సెట్‌నే నా పండుగగా భావించాను” అని ఆమె నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రోస్లిన్’ సిరీస్‌లో మీనా తల్లి పాత్రలో కనిపించబోతున్నారు. ‘‘నేను స్వయంగా తల్లిని కాకముందు చేసిన పాత్రలకు, ఇప్పడు చేస్తున్న పాత్రలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ ఎమోషన్స్ నా మనసు లోతుల్లో నుంచి వస్తున్నాయి. ప్రతి డైలాగ్ నా జీవితానికి కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది” అని అన్నారు.
ఇప్పటి పిల్లలకు టెక్నాలజీ వల్ల ప్రతి విషయంపై ముందే అవగాహన ఉంటోందని, మనం ఏదైనా చెప్పబోతే ‘మాకు తెలుసులే’ అన్నట్లుగా ప్రవర్తిస్తారని ఆమె నవ్వుతూ చెప్పారు. “పిల్లలకు ఏది సరైనదో వివరించడం మాత్రమే మన బాధ్యత. వారిని నియంత్రించడం లేదా మన మాట వినేలా బలవంతం చేయడం ఇప్పుడు సాధ్యం కాదు” అని ఆమె నేటి తల్లిదండ్రుల గురించి వివరించారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







