ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్
- February 22, 2026
70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం కేరళలోని కొచ్చి వేదికగా వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును అందుకున్నారు. ఇది ఆయన కెరీర్లో ఏడవ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు. 35: చిన్న కథ కాదు’ చిత్రానికి నివేతా థామస్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈసారి ‘పుష్ప 2’ ఎక్కువ అవార్డులను దక్కించుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ముఖ్య అవార్డులు (తెలుగు విభాగం)
- ఉత్తమ చిత్రం: పుష్ప 2
- ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: పుష్ప 2
- ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
- ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా)
- ఉత్తమ సాహిత్యం: “చుట్టమల్లే చుట్టేస్తోంది” (దేవర)
- ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టె – గుంటూరు కారం)
- ఉత్తమ గాయని: శిల్పా రావు (చుట్టమల్లే చుట్టేస్తోంది)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 AD), రామకృష్ణ & మోనిక (పుష్ప 2)
- ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టె)
- క్రిటిక్స్ అవార్డులు
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా
- ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







