శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- February 22, 2026
శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. యాత్రికులు బస చేస్తున్న వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే గది నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల ప్రకారం, కాటేజీలోని గదిలో అమర్చిన ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగతో పాటు మంటలు చెలరేగాయి. గదిలో ఉన్న భక్తులు పరిస్థితిని గమనించి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వారి అరుపులు విని ఇతర గదుల్లో ఉన్న యాత్రికులు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించగా, షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







