సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- February 24, 2026
సెయింట్ లూయిస్: తెలుగు వారి మేలు కోసం అమెరికాలో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్లో జరిగిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి స్వయంగా రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. రక్తదానం అనంతరం, ఆయన డాక్టర్ ఏజే తో కలిసి వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకుతగిన సలహాలు, చికిత్స అందించారు. ఈ వైద్య శిబిరంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అడ్వైజరీ బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి,మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర లు స్వయంగా రక్తదానం చేశారు. ఈ వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా వీరితో పాటు నాట్స్ మిస్సోరి చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ నాయకులు నాగ శ్రీనివాస్ శిస్ట్లా, నవీన్ కొమ్మినేని,మధుసూదన్ దడ్డాల తదితరులు ఈ వైద్య శిబిరంలో తమ విలువైన సేవలు అందించారు. చాలా మంది స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొని ఈ శిబిరంలో రక్తదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారితో పాటు, స్థానిక సమాజానికి మేలు చేకూరాలనే ఉద్దేశంతో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.. సమాజ హితం కోరి రక్తదానం చేసిన దాతలను, వైద్య సేవలు అందించిన వైద్యులను నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.. మిస్సోరీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచెర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ తో భారత రాయబారి ప్రశాంత్ పిసే భేటీ
- జర్మనీలో 40 బిలియన్ యూరోలు పెట్టుబడికి యూఏఈ ప్రణాళిక..
- క్రికెట్ బ్యాట్‌తో తన బంధాన్ని గుర్తుచేసుకున్న సచిన్
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ.. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
- ఢిల్లీలో BRICS సదస్సుకు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ ట్వీట్
- ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం సీఈఓతో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ భేటీ
- 'జై ఆవిష్కరణ్.. జై యువత' నినాదంగా ముందుకు సాగాలి: వెంకయ్యనాయుడు
- 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి టీజీ భరత్
- ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన షేక్ హమ్దాన్
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31.. ఎఫ్అండ్బీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు







