తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- February 24, 2026
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త చెప్పింది. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. పలు అంశాలపై చర్చించింది. కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
క్యాబినెట్ నిర్ణయాలు..
- హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు
- డైరక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH)గా మార్పు
- ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం
- ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు
- కాంగ్రెస్ కార్యాలయాలకు జిల్లాల్లో భూ కేటాయింపులు
- మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జెఎన్‌టీయూ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయింపు
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య భద్రతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 7.50 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ చికిత్స చేసుకునే అవకాశం కల్పించాము అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డ్ ద్వారా చికిత్స చేస్తారని వివరించారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే కోటి 50 లక్షల రూపాయల బీమా కల్పించామన్నారు.
”సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని నిర్ణయించాం. ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పిస్తాం. పద్మ అవార్డులు, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు, శ్రీనాథ్ సేవలు ప్రభుత్వం ఉపయోగించుకోనుంది.
మంజీర, గండిపేట నుంచి కొత్త పైపు లైన్, వాటర్ ట్రీట్ మెంట్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నది వందేళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మెట్రో 2 విస్తరణలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాం. మార్చి 31 లోపు ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైల్ ను టేకోవర్ చేయాలని నిర్ణయం.
బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించి సవివరంగా ప్రజలకు వివరిస్తాం. కోహెడ పండ్ల మార్కెట్ కోసం 239 ఎకరాలకు క్యాబినెట్ ఆమోదం. అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రతి నియోజవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్ నేషనల్ స్కూల్ కు ఆమోదం. భద్రాచలంలో 5 ఎకరాల్లో స్పోర్ట్స్ అథారిటీ. ఖమ్మంలో టీటీడీ దేవాలయం కోసం 20 ఎకరాలు కేటాయింపు. JNTU ఇంజనీరింగ్ కాలేజీ మహబూబాబాద్ ఏర్పాటుకి 70 ఎకరాలు భూమి కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయం. భద్రాద్రిలో మినీ స్టేడియం ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







