కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- February 24, 2026
కువైట్ః కువైట్ జనవరి 1, 2012న జన్మించిన వారితో ప్రారంభించి, 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత అందరు పురుషులకు మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసింది. ఈ మేరకు జాతీయ మిలిటరీ సర్వీస్ 2015 చట్టానికి కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. సవరణలు రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుండి 180 రోజులకు పొడిగించారు. అయితే, ఒకడే కుమారుడు ఉన్న వారకి సర్వీస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కువైట్ ఆయిల్ కంపెనీ అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం కువైట్ అగ్నిమాపక దళానికి మంజూరు చేసిన మినహాయింపులను పొందుతారు. అలాగే, కువైట్ సాయుధ దళాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ నేషనల్ గార్డ్ మరియు కువైట్ అగ్నిమాపక దళాలకు సైనికులను కేటాయించడానికి నేషనల్ మిలిటరీ సర్వీస్ అథారిటీకి అధికారాలు కల్పించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







