భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- February 24, 2026
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి మరియు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఫిబ్రవరి 24న రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముంది. వర్షాలతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు, రవాణా విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఫిబ్రవరి 25న ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలు, చెట్లు దగ్గర నిలబడకుండా జాగ్రత్త పడాలి. తాజా వాతావరణ సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించడం మంచిది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







