నాని- సుజీత్ మూవీ ‘బ్లడీ రోమియో’..
- February 25, 2026
నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మక చిత్రం #నాని34 'బ్లడీ రోమియో', మైండ్ బ్లోయింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి ప్రతిష్టాత్మక వెంచర్ - #నాని34 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ పెట్టారు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల OG తో భారీ విజయాన్ని అందించిన స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుజీత్ తో నానికి ఇది ఫస్ట్ కొలాబరేషన్. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అద్భుతమైన కామిక్-నోయిర్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
డీప్ పర్పుల్స్, బ్లడ్ రెడ్స్‌తో నిండిన ఈ విజువల్ లాంగ్వేజ్, ఈ సినిమా యాక్షన్‌తో పాటు స్టైలిష్ ఎస్తెటిక్ ఫ్లేర్‌కి ప్రాధాన్యం ఇస్తుందని ప్రజెంట్ చేస్తోంది. ప్రోమోలో హీరోను కిచెన్‌లో పరిచయం చేస్తారు. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ కొనసాగుతున్న కొద్దీ, అతని “రెసిపీలు” నిజానికి అతని హింసాత్మక స్వభావానికి ప్రతీకలని రివిల్ అవుతుంది. “చిటికెడు కరుణ”, “పిడికెడు కోపం” లాంటి పదార్థాలను వంటకంగా చూపిస్తూ, తన జీవితాన్ని ఓ మాస్టర్ చెఫ్ లా ప్రజెంట్ చేశారు. సాధారణంగా కనిపించే ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా టైమ్ బాంబ్‌లా పేలిపోవడం ద్వారా “గ్యాంగ్‌స్టర్’స్ డెన్”ను ధ్వంసం చేయడం ఈ కాన్సెప్ట్‌కి క్లైమాక్స్‌గా నిలిచింది.
నాని పాత్ర ఒక ఫైటర్‌గా కాకుండా, దేనికి లెక్క చేయని పవర్ లా బయటి రావడం అదిరిపోయింది. “No.1 Chef” నుంచి “No.1 Gangster”గా మారే కార్డ్ రివీల్ సినిమా నేచర్ ని అద్భుతంగా చూపిస్తుంది. చివర్లో లండన్ నేపథ్యంతో వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తూ, మండుతున్న కార్డ్‌తో సిగార్ వెలిగించే నాని షాట్ అతని “రోమియో”, డేంజర్ పర్సోనా ప్రజెంట్ చేసింది.
ప్రోమో చివర్లో లండన్ స్కైలైన్ సిల్హౌట్స్‌తో 'బ్లడీ రోమియో టైటిల్ లోగో కనిపించింది. ఇది సుజీత్, నాని “నేచురల్ స్టార్” ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడని సూచిస్తుంది. దర్శకుడి భారీ యాక్షన్ స్టైల్‌తో పాటు, డార్క్ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ డ్రైవన్ కథను మిళితం చేసి అద్భుతంగా చూపించబోతున్నారు.
ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ మైండ్ బ్లోయింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాలను సెట్ చేసింది.
బ్లడీ రోమియో ఇతర తారాగణం, సిబ్బంది వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తారాగణం: నేచురల్ స్టార్ నాని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సుజీత్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







