రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- March 07, 2026
రియాద్: సౌదీ అరేబియా మరియు దుబాయ్ మధ్య విమాన సేవలు పాక్షికంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు సౌదియా ప్రకటించింది.రియాద్ -దుబాయ్ మధ్య మరియు జెడ్డా - దుబాయ్ మధ్య పరిమిత సేవలు ఉంటాయని ఎయిర్‌లైన్ తెలిపింది.
రియాద్ నుండి దుబాయ్‌కు SV596 మరియు జెడ్డా నుండి దుబాయ్‌కు SV588 అవుట్‌బౌండ్ విమాన సర్వీసులు.. దుబాయ్ నుండి రియాద్‌కు SV597 మరియు దుబాయ్ నుండి జెడ్డాకు SV589 ఇన్‌బౌండ్ సర్వీసులలో ఉంటాయని తెలిపింది. విమానాలు ప్రారంభంలో పరిమిత షెడ్యూల్‌లో నడుస్తాయని, అదనపు సేవలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతాయని సౌదియా తెలిపింది.
అదే సమయంలో అమ్మాన్, కువైట్ సిటీ, అబుదాబి, దుబాయ్, దోహా మరియు బహ్రెయిన్‌లకు బయలుదేరే విమానాల సస్పెన్షన్‌ను మార్చి 8 (23:59 GMT) వరకు పొడిగించినట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది. మాస్కో మరియు పెషావర్‌లకు బయలుదేరే విమానాలు మార్చి 15 వరకు నిలిపివేయబడతాయని పేర్కొంది.
ప్రయాణీకులు విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని మరియు సౌదియా అధికారిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా జారీ చేసిన అప్డేట్ లను ఫాలో కావాలని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







