బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- March 13, 2026
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఫ్రాంచైజీలకు గట్టి షాక్ ఇచ్చింది.జట్ల ప్రాక్టీస్ సెషన్లలో సమాన అవకాశాలు కల్పించేందుకు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.దీని ప్రకారం, ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్‌ను లేదా నెట్స్‌ను మరో జట్టు తన సెషన్ కోసం ఉపయోగించడానికి వీల్లేదు. ప్రతి జట్టుకు తాజాగా సిద్ధం చేసిన నెట్స్‌ను మాత్రమే కేటాయించాలని హోస్ట్ అసోసియేషన్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. ఒక జట్టు ప్రాక్టీస్ ముగించిన తర్వాత, వారు వాడిన రేంజ్-హిట్టింగ్ వికెట్లు లేదా త్రో-డౌన్ నెట్స్‌ను రెండో జట్టు వాడకూడదని నిబంధన విధించింది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లపైనా బీసీసీఐ స్పష్టమైన సూచనలు చేసింది.ఫ్రాంచైజీలు గరిష్ఠంగా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు.అయితే, ఈ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయాలి.ఈ మ్యాచ్‌లను అసలు మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌పై నిర్వహించకూడదు. ఒకవేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనుకుంటే, దాని వ్యవధి మూడున్నర గంటలకు మించరాదని కూడా బీసీసీఐ నిర్దేశించింది.
సీజన్‌లో ఒక ఫ్రాంచైజీ తమ తొలి హోమ్ మ్యాచ్ ఆడేందుకు నాలుగు రోజుల ముందు నుంచి ప్రధాన స్క్వేర్‌పై ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు లేదా మ్యాచ్‌లు నిర్వహించరాదు. ఈ సమయంలో హోమ్ ఫ్రాంచైజీ కోరితే, సంబంధిత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది.
ప్రాక్టీస్ కోసం రెండు జట్లకు చెరో రెండు నెట్స్, రేంజ్ హిట్టింగ్ కోసం ప్రధాన స్క్వేర్‌పై ఒక నెట్‌ను కేటాయిస్తారు.ప్రాక్టీస్ షెడ్యూల్ విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే, విజిటింగ్ జట్టుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.సాధారణంగా హోమ్ జట్టుకే తొలి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, విజిటింగ్ జట్టు ప్రయాణ ఏర్పాట్లు, ముందు రోజు మ్యాచ్ ఆడి ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి అభ్యర్థనను గౌరవిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







