ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- March 13, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు.వీరి కోసం విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్షా కేంద్రాలను వెతుక్కునే క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఏపీ విద్యాశాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ (QR Code) ను ముద్రించారు. మొబైల్ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన లొకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని సంక్లిష్టమైన చిరునామాల్లో ఉన్న సెంటర్లను గుర్తించడానికి ఈ సాంకేతికత ఎంతో దోహదపడనుంది.
అంతేకాదు ఏపీ ప్రభుత్వం నిమిషం నిబంధనను కూడా పక్కన పెట్టింది. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతంది.. మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. అయితే ఎగ్జామ్ సెంటర్లలోకి విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంగణంలోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా అనుమతిస్తామన్నారు.
ఏప్రిల్ 4వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 13 వరకు మూల్యాంకన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాల్యూషన్ ఉంటుంది.ఇంటర్ వాల్యూషన్ కోసం 26 జిల్లా కేంద్రాల్లో స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఈ సెంటర్లకు క్యాంపు అధికారులుగా ఆయా జిల్లాలకు చెందిన విద్యాధికారులు ఉంటారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు రోజుకు 40 చొప్పున జవాబుపత్రాలు మాత్రమే ఇస్తారు. అంతేకాదు మూల్యాంకనం తర్వాత మార్కుల లెక్కింపులో తప్పులకు ఆస్కారం లేకుండా ట్యాబ్‌ల్లో నమోదు చేసే విధానం తీసుకొస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







