ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- March 13, 2026
హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు, డీలర్లకు రవాణా శాఖ శుభవార్త తెలిపింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్‌లో అనుసరిస్తున్న పేపర్ ఆధారిత పద్ధతికి స్వస్తి పలికి, నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్లు ఎలాంటి ఫిజికల్ పత్రాలనూ ఆర్టీఏ కార్యాలయాలకు పంపకూడదు. యజమాని సంతకాలతో కూడిన ఫాం-20, ఇతర పత్రాలను స్కాన్ చేసి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈనెల 13వ తేదీకి ముందు టెంపరరీ రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు కూడా ఈ ఆన్లైన్ సదుపాయం కల్పించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







