తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- March 16, 2026
దుబాయ్: ముందు జాగ్రత్త చర్యగా అమలు చేసిన తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు అక్కడి నుండి కొన్ని గమ్యస్థానాలకు ఎంపిక చేసిన మార్గాల్లో ఫ్లైట్స్ ను క్రమంగా పునఃప్రారంభిస్తున్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ తెలిపింది. తాజా విమాన అప్డేట్ ల కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
డ్రోన్ సంబంధిత సంఘటన కారణంగా దుబాయ్‌కు మరియు అక్కడి నుండి బయలుదేరే అన్ని విమానాలను స్వల్పంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎమిరేట్స్ ఉదయం 10 గంటల తర్వాత పరిమితంగా దుబాయ్ విమాన షెడ్యూల్‌ను నడుపుతున్నట్లు తెలిపింది. తాజా అప్డేట్ అందించే వరకు ప్రయాణికులను విమానాశ్రయానికి రావొద్దని కోరింది. తాత్కాలిక రద్దుల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులందరికీ వసతి ఎంపికలపై గైడ్ లైన్స్ తో పాటు రద్దు నోటీసు అందుతుందని ఎమిరేట్స్ తెలియజేసింది.
Dubai Civil Aviation Authority announces the gradual resumption of some flights to and from Dubai International Airport to selected destinations, following the temporary suspension implemented as a precautionary measure.
— Dubai Media Office (@DXBMediaOffice) March 16, 2026
Passengers are advised to check with their airlines for…
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









