ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- March 16, 2026
దోహా: ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) వాహనదారులకు అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల ముందు వాహనాలను ఆపవద్దని లేదా పార్క్ చేయవద్దని గుర్తు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్‌లలో అధికారిక ప్రకటనను పోస్ట్ చేసింది.
ప్రతి డ్రైవరు సూచనలు మరియు మార్గదర్శకాలను గౌరవించాలని పిలుపుచిచ్చింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఖతార్ నమ్మకమైన విద్యుత్ నెట్వర్క్. సరఫరాకు వెన్నెముకగా నిలుస్తుంది. ఖతార్ వ్యాప్తంగా గృహాలు, వ్యాపారాలు మరియు అవసరమైన సేవలకు అధిక-నాణ్యత విద్యుత్ ను సరఫరా చేస్తోంది.
ఈ సౌకర్యాల ముందు పార్కింగ్ చేయడం లేదా వాహనాలను ఆపడం వలన సాంకేతిక బృందాలు, నిర్వహణ సిబ్బంది మరియు అత్యవసర ప్రతిస్పందనదారులకు కీలకమైన యాక్సెస్ మార్గాలు నిలిచిపోతాయన్నారు.
ఈ సైట్లను చేరుకోవడంలో ఏదైనా ఆలస్యం లోపాలు లేదా అంతరాయాల సమయంలో త్వరిత మరమ్మతులకు ఆటంకం కలిగించవచ్చని అన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







