డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- March 16, 2026
కువైట్: కువైట్ లో డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టొబాకో, సిగరెట్లు మరియు సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఒసామా బోడి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని రకాల సిగరెట్లు మరియు ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అలాగే ఆన్‌లైన్ డెలివరీ సేవల ద్వారా వాటి వినియోగం కోసం ఉపయోగించే పరికరాలు, సాధనాలు మరియు ఉపకరణాలతో సహా పొగాకు మరియు దాని ఉత్పన్నాల అమ్మకాలను నిషేధించారు.
ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిర్దేశించిన భారీ జరిమానాలను లేదా జైలు శిక్షను విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, ఆయా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించడం లేదా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్‌ను రద్దు చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







