అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- March 18, 2026
మస్కట్: రాబోయే రోజుల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నందున, శుక్రవారం నుంచి ఒమన్ సుల్తానేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక గవర్నరేట్లలో వేర్వేరు తీవ్రతలతో వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే బులెటిన్ల ద్వారా మరిన్ని వివరాలు అందిస్తామని వారు తెలిపారు. అధికారిక వర్గాల నుండి అందిన తాజా సమాచారం ప్రకారం, ప్రాథమిక అంచనాకు మించి అదనపు హెచ్చరికలు లేదా సూచనలు ఏవీ జారీ కాలేదు.
ఇటీవలి రోజుల్లో సుల్తానేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినందున, ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. పౌర విమానయాన సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°Cకి చేరువలో నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో బర్కాలో అత్యధికంగా 39.9°C ఉష్ణోగ్రత నమోదైంది. వాడి అల్ మావిల్ మరియు అల్ కామిల్ వల్ వాఫీతో సహా ఇతర ప్రాంతాలలో 39.2°C, ఆ తర్వాత మహౌట్లో 39.1°C మరియు జలాన్ బని బు అలీలో 39.0°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హమ్రా అల్ దురు, యాలోని, రుస్తాఖ్, అల్ సువైఖ్ మరియు బిదియాలలో ఉష్ణోగ్రతలు 38.3°C నుండి 38.7°C మధ్య ఉన్నాయి.
రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని, అదే సమయంలో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశాలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
అధిక ఉష్ణోగ్రతలు ఉండే సమయాల్లో నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువసేపు బయట తిరగకుండా ఉండాలని మరియు అధికారిక వాతావరణ సమాచారాన్ని ఫాలో కావాలని వాతవరణకేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







