ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- March 23, 2026
దోహా: ఖతార్ జాతీయ గ్రంథాలయం మార్చి 24 నుండి అందుబాటులోకి రానుంది. గ్రంథాలయాన్ని ఒక కీలక కేంద్రంగా భావించే విద్యార్థులు, పరిశోధకులు మరియు కుటుంబాలకు ఇది ఆహ్వానించ దగిన పరిణామంగా పేర్కొన్నారు.
ఈ గ్రంథాలయం శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
యువ పాఠకులకు మరియు కుటుంబాలక ప్రత్యేకంగా ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
దీనికి పాటు ఎక్కువసేపు నిశ్శబ్దంగా చదువుకోవడానికి సమయం కోరుకునే విద్యార్థులు మరియు నిపుణుల కోసం గ్రంథాలయం రాత్రి అధ్యయన సమయాలను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించారు.
ఈ సమయాలు శుక్రవారం నుండి బుధవారం వరకు రాత్రి 8 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటాయి. అయితే గురువారాల్లో రాత్రి సెషన్ శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పొడిగించబడుతుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







