దేత్తడి హైదరాబాద్ కల్చర్ ని ప్రపంచానికి గొప్పగా చూపించే సినిమా: నిర్మాత దిల్ రాజు
- March 24, 2026
ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' ఘనీ భాయ్ మాస్-అప్పీలింగ్ గ్లింప్స్ లాంచ్
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
ఈ గ్లింప్స్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ వరల్డ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఘన్ను భాయ్, అతని టీం దాదాపు ఏడు కిలోల డ్రమ్ములను మోస్తూ, గంటల తరబడి విరామం లేకుండా ప్రదర్శన ఇస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆ సంగీతం వెనుకకనిపించే ఆత్మగౌరవం, హుందాతనం ఉన్నాయి. ఈ గ్లింప్స్ ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా, శక్తివంతంగా ప్రజెంట్ చేసింది.
ఆశిష్ నటన అద్భుతంగా వుంది. అతని రఫ్ మేకోవర్ ఆ పాత్రకు చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో ఎంత సహజంగా జీవించారు. అతని హావభావాలు, నేచురల్ ప్రజెన్స్, డ్రింక్ చేసే విధానం, అలవోకగా పలికే హైదరాబాద్ యాస ఈ పాత్రకు బలమైన మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి.
ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఆదిత్య రావు గంగాసాని కథనాన్ని అద్భుతమైన పట్టుతో నడిపించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్మించారు. ఆ స్కేల్ ఈ చిన్న గ్లింప్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా వుండగా, సంగీత దర్శకుడు జునైద్ కుమార్ ఉర్రూతలూగించే డ్రమ్ బీట్స్‌తో పండుగ వాతావరణాన్ని మరింత పెంచారు.
మొత్తం మీద, పర్ఫెక్ట్‌గా కట్ చేసిన ఈ గ్లింప్స్, సినిమా ఏమి అందించబోతోందో స్పష్టంగా ప్రజెంట్ చేసింది. చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోందని సూచిస్తూ.. "జాతర త్వరలో ప్రారంభమవుతుంది," అని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
'ది గ్లింప్స్' అత్యద్భుతంగా లాంచ్ చేశారు. 500 మందికి పైగా స్ట్రీట్ డ్రమ్మర్లు ఏకతాటిపై హోరెత్తిస్తూ, వాతావరణాన్ని ఎనర్జీని నింపేశారు. వారి ఉత్సాహభరితమైన పెర్ఫార్మెన్స్ ఈవెంట్ స్థాయిని పెంచడమే కాకుండా, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దేత్తడి కథ పుట్టడానికి కారణం ఆదిత్య. హైదరాబాదులో ఉండే కల్చర్ ఫెస్టివల్స్ గురించి ఈ సినిమా, ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు గురించి తన లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్ అన్నిటిని ఘన్ను అనే క్యారెక్టర్ తో ఒక కథ రాసుకొని హైదరాబాదులో ఉండే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్.. ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. ఏడాదిగా ఆదిత్య ఆశిష్ బ్యాండ్ వాయించే వాళ్ళు చుట్టూ తిరుగుతూ వాళ్ల గురించి తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్ లో ఉండే ఇన్సిడెంట్ అన్ని పోగుచేసుకొని దేత్తడి కథని ఫైనల్ గా రాశారు. ఈవెంట్ కి హైదరాబాదులో ఉండే బ్యాండ్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్లి కలిశారు. తమ గురించి సినిమా తీస్తున్నారని ఆనందంతో ఫ్రీగా దాదాపు ఆరు వందల మంది వచ్చి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఉన్న బ్యాండ్ పీపుల్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. గత ఏడాదిగా ఆశిష్ ఈ సినిమా కోసం ప్రతి బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి బ్యాండ్ ఎలా కొట్టాలి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి.. ఇలా నేర్చుకుని ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు. ఆశిష్ ఆదిత్య వాళ్ళ టీం చేస్తున్న ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆదిత్య కథ అద్భుతంగా రాసుకున్నాడు. ఆదిత్యతోపాటు ప్రసన్న ఈ స్క్రిప్ట్ ని ఫుల్ పూర్తిస్థాయిలో రాసుకున్నారు. హైదరాబాద్ కల్చర్ ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాజులేషన్స్.
హీరో ఆశిష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక ఏడాది క్రితం ఆదిత్య ఒక గ్లిమ్స్ చూపించారు. అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏడాదిగా కష్టపడుతున్నాం. సినిమా రిలీజ్ అయిన అడియన్స్ మా కష్టాన్ని చూస్తారు. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. మన హైదరాబాద్ కల్చర్ ని ఒక దేత్తడి రేంజ్ లో చూపించడానికి వస్తున్నాం. సినిమా అద్భుతంగా తీశారని మీరు మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్రతి బ్యాండ్ గర్వపడేలా ఈ సినిమా తీస్తాం. మీతో పాటు మా ఇజ్జత్ కోసం ఈ సినిమా తీస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి బ్యాండ్ వ్యక్తికి ధన్యవాదాలు.
డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా టీం ని సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ముందుకెళ్లడానికి కారణం మా హీరో. ఆయనే మొదటగా కథని నమ్మారు. అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. మన పండగలు మన పాటలు మన హైదరాబాద్ కల్చర్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించాలని నా కోరిక. ఈ కథ ఈ సినిమా నామీద ఒక బాధ్యతను పెంచింది. కచ్చితంగా మంచి సినిమాను తీస్తున్నాం. అందరికీ గుర్తుండిపోయే సినిమాను తీస్తాం.
రైటర్ ప్రసన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్న బ్యాండ్ కమ్యూనిటీ మొత్తానికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా వచ్చిన తర్వాత బ్యాండ్ ఆర్టిస్ట్ అనే గౌరవం తెచ్చేలాగా ఉంటుంది. ఇప్పటివరకు హైదరాబాది బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అసలైన హైదరాబాద్ కల్చర్ చూపించే ఫస్ట్ సినిమా ఇదే కాబోతోంది. త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను.
నటీనటులు: ఆశిష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్
కథ, దర్శకత్వం: ఆదిత్య రావు గంగాసాని
స్క్రీన్ ప్లే, సంభాషణలు, క్రియేటివ్ హెడ్: ప్రసన్న కుమార్ బెజవాడ
ఎగ్జిక్యూటివ్-ప్రొడ్యూసర్: మురళీ పున్న (బిట్టు)
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









