పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- March 24, 2026
అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కీలకమైన 'గ్రోత్ ఇంజిన్'గా మారుతోందని, ఈ రంగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మార్చి 25న బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న సమీక్షా సమావేశం నేపథ్యంలో మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ తన ఛాంబర్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రాబోయే 15 ఏళ్లకు ఏపీటీడీసీ ఆర్థిక ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు, దిశానిర్దేశం చేసిన అంశాలు, నూతన పెట్టుబడులు, హోటల్స్, హాస్పిటాలిటీ, ఎస్ఐపీబీ లో ఆమోదం పొందిన ప్రాజెక్టు వివరాలు,హోమ్‌స్టేల పురోగతి, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, పర్యాటక ప్రాంతాలకు కల్పిస్తున్న ప్రచారంపై చర్చించారు. గోదావరి పుష్కరాల లోపే 'అఖండ గోదావరి' ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.పర్యాటకుల సంఖ్యను పెంచేలా వినూత్న నిర్ణయాలు తీసుకోవాలని, బాధ్యతాయుత పర్యాటకానికి పెద్దపీట వేయాలని, క్రియేటివ్ ఎకానమీ డెవలప్ మెంట్ దిశగా చర్యలుండాలని అధికారులకు మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.
సమీక్షా సమావేశంకు ముందు ఇటీవల ముంబయిలో జరిగిన IAAPI (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్) ఎక్స్పో-2026 వేదికగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సంబంధిత ప్రతినిధులు రామ్ ప్రకాష్ మహేశ్వరీ, అంకుర్ మహేశ్వరిలు మంత్రి దుర్గేష్ ను ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారులతో కలిసి విశాఖ వీఎంఆర్డీఏ పరిధిలో దాదాపు రూ.100 కోట్లతో ఏర్పాటు చేయబోయే అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్క్ మరియు రిసార్ట్ కు అనువైన స్థలాలు గుర్తించామని మంత్రికి వారు వివరించారు. అనతి కాలంలోనే తమకు పర్యాటక శాఖ అధికారులు అందించిన మార్గదర్శకత్వంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి వహించారని, త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమని మంత్రి దుర్గేష్ కు వారికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 'స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047'లో భాగంగా వినోద రంగాన్ని రాష్ట్ర పర్యాటక వృద్ధికి ప్రధాన చిహ్నంగా మలిచే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఈడీలు పద్మావతి, శేషగిరిరావు, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మా రాణి సీలా, ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సత్యప్రభ, పర్యాటక శాఖ అధికారులు లెజ్వంతి, నాంచారయ్య, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







