అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- March 28, 2026
దోహా: ప్రాంతీయ అశాంతి నేపథ్యంలో వాషింగ్టన్లో ఖతార్-అమెరికా చర్చలు జరిపాయి. రక్షణ సంబంధాలు, ఎల్ఎన్జి సరఫరా స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రతపై దృష్టి సారించాయి. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ, అమెరికా అధికారిక పర్యటనలో భాగంగా వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్లను కలిశారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఖతార్ మరియు అమెరికా మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. అలాగే, పలు రంగాలలో సహకారాన్ని విస్తరించుకునే మార్గాలను ఇరుపక్షాలు దృష్టి సారించాయి.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరు పక్షాలు ప్రపంచ ఇంధన మార్కెట్లలోని పరిణామాలను కూడా సమీక్షించాయి. ప్రపంచ ఇంధన స్థిరత్వానికి మద్దతివ్వడంలో కీలక అంశమైన సుస్థిర ఇంధన సరఫరాలను పెంచడం, ఖతార్ నుండి అంతర్జాతీయ మార్కెట్లకు ద్రవీకృత సహజ వాయువు (LNG) నిరంతర సరఫరాను కొనసాగించడంపై సమీక్షించారు.
"ప్రపంచ ఇంధన భద్రతను పరిరక్షించడం, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా సముద్రయాన స్వేచ్ఛ ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఖతార్-అమెరికా వ్యూహాత్మక సంబంధం జేడీ వాన్స్ ప్రశంసించారు. అలాగే ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు ప్రపంచ ఇంధన భద్రతకు దోహదపడటంలో ఖతార్ పోషిస్తున్న చురుకైన పాత్రను కొనియాడారని తెలిపింది.
షేక్ మహమ్మద్ వాషింగ్టన్లో జరుపుతున్న విస్తృత పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ను కూడా కలిశారని తెలిపారు. వారి చర్చలు రక్షణ, భద్రతా సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాయి. ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడానికి, అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు కొనసాగాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







