దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- March 28, 2026
మనామా: బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తన తాత్కాలిక నెట్‌వర్క్ కార్యకలాపాలను ఏప్రిల్ నెల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దమ్మామ్ నుండి లండన్ హీత్రూ (LHR)కు విమాన సర్వీసులు ఏప్రిల్ 11వరకు కొనసాగుతాయి. కాగా, దమ్మామ్ నుండి ముంబై (BOM), నైరోబి (NBO), కైరో (CAI), చెన్నై (MAA), బ్యాంకాక్ (BKK), కాసాబ్లాంకా (CMN), మరియు మనీలా (MNL)లకు విమాన సర్వీసులు ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయి. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా బహ్రెయిన్ మరియు ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినప్పటికీ, గల్ఫ్ ఎయిర్ దమ్మామ్ మీదుగా 10 గమ్యస్థానాలకు తాత్కాలిక నెట్‌వర్క్ సర్వీసులను కొనసాగిస్తోంది.
ఈ విమానాలలో బుకింగ్‌లు ఖరారు చేసుకున్న ప్రయాణీకుల కోసం గల్ఫ్ ఎయిర్, బహ్రెయిన్ మరియు కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య భూ రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
గల్ఫ్ ఎయిర్ ఏర్పాటు చేసిన భూ రవాణాను ఉపయోగించి బహ్రెయిన్ రాజ్యానికి వెళ్లి వచ్చే ప్రయాణీకుల కోసం, గల్ఫ్ ఎయిర్ ప్రత్యేకంగా సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసా సహాయాన్ని అందిస్తోంది. ప్రయాణీకులు తమ విమాన టిక్కెట్లను గల్ఫ్ ఎయిర్ వెబ్‌సైట్ gulfair.com ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







