తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- March 30, 2026
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కారు డ్రైవర్‌పై ఉన్న నమ్మకానికి, కృతజ్ఞతకు నిదర్శనంగా ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి విజయ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
విజయ్ తన అభ్యర్థుల ఎంపికలో సామాన్యులకు, కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్‌కు కృతజ్ఞతగా, ఆయన కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
వేదిక పై ఈ ప్రకటన చేయగానే రాజేంద్రన్, శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్‌ను హత్తుకుని, ఆయన పాదాలపై పడుతూ తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, “మా పార్టీ సామాన్య ప్రజలకు అవకాశం ఇస్తుంది. వారసత్వ రాజకీయాలకు, డబ్బు ఆధారిత రాజకీయాలకు మా వద్ద స్థానం లేదు. చదువుకున్న యువతకు పెద్దపీట వేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







