ఆకట్టుకుంటున్న అనకాపల్లి టీజర్
- March 30, 2026
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం అనకాపల్లి. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు త్రినాథరావు నక్కిన.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి’ అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







