ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- April 04, 2026
రియాద్ః 2026 ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో ఎనిమిది సౌదీ నగరాలు మెరుగైన పనితీరును నమోదు చేశాయి. రియాద్ ప్రపంచవ్యాప్తంగా 27వ స్థానం నుండి 24వ స్థానానికి ఎగబాకగా, మక్కా 50వ స్థానంలో, జెడ్డా 55వ స్థానంలో, మదీనా 67వ స్థానంలో, అల్‌ఖోబార్ 64వ స్థానంలో నిలిచాయి.
అల్-ఉలా 112వ స్థానం నుండి 85వ స్థానానికి ఎగబాకి, మెరుగైన పురోగతిని నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 148 నగరాలలో హైల్ మరియు హఫర్ అల్-బాటిన్ నగరాలు మొదటిసారిగా ఈ సూచికలో చేరాయి. వరుసగా 33వ మరియు 100వ స్థానాలను పొందాయి.
సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు వాటి ప్రభావంపై నివాసితుల అభిప్రాయాల ఆధారంగా.. నగరాలు ఆధునిక సాంకేతికతలను ఎలా స్వీకరిస్తున్నాయో ఈ ప్రపంచ సూచిక కొలుస్తుంది.
'కృత్రిమ మేధస్సు సంవత్సరం 2026'ను జరుపుకుంటున్న తరుణంలో పట్టణ సేవలను మెరుగుపరచడానికి మరియు జీవన నాణ్యతను పెంచి, ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేసే స్మార్ట్, సుస్థిర నగరాలను నిర్మించడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ ఫలితాలు బలాన్ని చేకూర్చాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







