మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ప్రారంభం
- April 05, 2026
స్వర్గీయ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఆస్మాన్’ శనివారం (ఏప్రిల్ 4, 2026) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ యువ హీరోలు, ప్రముఖులు హాజరై సందడి చేశారు.
శ్రీ క్లీంకార సెల్యులాయిడ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.ముహూర్తపు సన్నివేశానికి మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, యువ హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ప్రముఖ నిర్మాత, నటి నిహారిక కొణిదెల చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ని అందజేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు రామ్ నందన్ గౌరవ దర్శకత్వం వహించారు.మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్,ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తదితరులు హాజరై మేఘాంశ్ శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో..మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ తో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామ’ని అన్నారు. డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ.. ‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







