ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- April 05, 2026
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్న ఈస్టర్ పండుగను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన సందేశాన్ని పంపారు. ఈ పండుగ మానవాళికి ఇచ్చే గొప్ప సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏసుక్రీస్తు పునరుత్థానం అనేది సత్యం మరియు కరుణకు ఉన్న శక్తిని చాటిచెబుతుందని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జగన్ స్పందిస్తూ.. “సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న గొప్ప నిజాన్ని ఏసుక్రీస్తు పునరుత్థానం మనకు గుర్తు చేస్తుంది.ఈ పండుగ పవిత్రత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి” అని ఆకాంక్షించారు.ఈ ఈస్టర్ పర్వదినం ప్రతి ఇంటిని ప్రేమ, శాంతి మరియు శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Today, as we celebrate the miracle of His resurrection, let us remember that truth and compassion can never be defeated. May this Easter fill every household with love, hope, peace and prosperity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2026
Happy Easter!
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









