ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- April 07, 2026
సోహార్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ విలాయత్ లో "ఆహార భద్రతా వారోత్సవాలు 2026" అవగాహన ప్రదర్శన ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల డైరెక్టరేట్ జనరల్ నిర్వహిస్తుంది. సోహార్ వలీ అయిన షేక్ సౌద్ బిన్ మహమ్మద్ అల్ హినాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది.
ఉత్తర అల్ బతినా మునిసిపాలిటీ, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ మరియు విద్యా డైరెక్టరేట్ జనరల్‌తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఆహార భద్రతాను ప్రోత్సహించడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఇది ఒక నమూనాగా నిలుస్తుందరి వక్తలు పేర్కొన్నారు.
ఈ ప్రదర్శన వివిధ వర్గాలలో ఆహార భద్రత భావనలు మరియు పద్ధతులపై అవగాహనను పెంపొందిస్తుందని తెలిపారు. ఆహారాన్ని వినియోగించడానికి మరియు నిల్వ చేయడానికి అత్యంత సురక్షితమైన మార్గాలను తెలియజేయడం ద్వారా ఆహార భద్రతా సంస్కృతిని పటిష్టం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహార వినియోగ అలవాట్లను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా, ఈ ప్రదర్శన ఆహార భద్రతా రంగంలో విజయవంతమైన నమూనాలను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







