వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- April 07, 2026
దోహా: ఏప్రిల్ 30న సర్క్యూ డ్యూ లిబన్ (Cirque du Liban) వారి ' పౌంటానా షో (Fontana Show)' ఖతార్‌కు రానుందని విజిట్ ఖతార్ ( Visit Qatar) ప్రకటించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రదర్శన, హయత్ ప్లాజా (Hyatt Plaza) వద్ద ఉన్న సర్కస్ టెంట్ లో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శన మే 31 వరకు కొనసాగుతుంది.
ఈ ప్రదర్శన సర్కస్ కళా నైపుణ్యాన్ని అధునాతన వాటర్, లైట్ మరియు సౌండ్ అంశాలతో మేళవిస్తూ.. ఖతార్‌లోని ప్రేక్షకులకు భారీ స్థాయి జల విన్యాసాలను పరిచయం చేస్తుంది. ఖతార్‌లో ఒక అద్భుతమైన వాటర్ సర్కస్ (Water Circus) అనుభవాన్ని అందిస్తుంది.
ఏప్రిల్ 30 - మే 31
సర్కస్ టెంట్, హయత్ ప్లాజా
టిక్కెట్లు బయోలోని లింక్ ద్వారా పొందవచ్చు.
కుటుంబాలను మరియు ప్రత్యక్ష వినోద ప్రియులను ఒకేలా ఆకట్టుకునేలా రూపొందించిన ఒక కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి, అంతర్జాతీయ స్థాయి కళాకారుల బృందం ఒకచోట చేరనుంది. టిక్కెట్ల కోసం వెబ్సైట్ ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. వీటి ధరలు గ్రీన్ కేటగిరీకి QR95 నుండి గోల్డ్ కేటగిరీకి QR360 వరకు ఉంటాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







