ప్రొడ్యూసర్ శివప్రసాద్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- April 07, 2026
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు.ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శివప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ప్రొడ్యూసర్‌గా మీ జర్నీ గురించి?
మొదట శ్రీరామ్‌తో మాతృ సినిమా నిర్మించాం.తర్వాత రారాజా ప్రొడ్యూస్ చేశాం.సుహాసిని మణిరత్నంతో మహతి అనే సినిమా చేస్తున్నాం.ఆ సినిమా షూటింగ్‌లో ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది.
విజయ్ సేతుపతి ఏస్ సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేశాం.మరాఠీలో ఒక సినిమా తీశాం, అది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ నేనే.
ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. గీతాంజలి, మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మా తమ్ముడిని పరిచయం చేస్తూ రంగూన్ రాజా అనే సినిమా చేశాం.ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.జూలైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా గురించి?
-గత సంవత్సరం ఈ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నాము.ఈ సినిమా కోసం చాలా మంది ప్రయత్నించారు.కానీ మేమే ముందుగా కమిట్ అయినందున, వాళ్లు మాకు ఇచ్చారు.
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. దాదాపు 500 స్క్రీన్స్‌లో రిలీజ్ కానుంది.డిస్ట్రిబ్యూషన్ పరంగా మేము సేఫ్‌గా ఉన్నాం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ ఇది. టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌పై ప్రభావం చూపితే ఎలా ఉంటుందనే విషయం ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది.టెక్నాలజీ కారణంగా మనుషుల మధ్య సంబంధాలు హార్ట్‌ఫుల్‌గా కాకుండా ఆర్టిఫిషియల్‌గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రదీప్ రంగనాథన్ గారు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అలాగే విగ్నేష్ శివన్ గారు కూడా అద్భుతమైన డైరెక్టర్.అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలైట్.
తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకు ఇప్పటికే మంచి రీచ్ వచ్చింది.దిల్ రాజు, అనిల్ రావిపూడి ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కంటెంట్ కూడా కచ్చితంగా ఆడియన్స్‌లోకి వెళ్తుంది. ఇది ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్.
ఎస్.జే. సూర్య పాత్ర సినిమాలో అద్భుతంగా వచ్చింది. ఆయన ఒక హీరోలా చేశారు. ప్రదీప్, సూర్య ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.విగ్నేష్ మంచి విజన్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తీశారు.
కొత్తగా మీరు చేయబోయే సినిమాలు?
మా తమ్ముడు అజయ్ హీరోగా రంగూన్ రాజా సినిమా చేశాం. అది జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే మహతి సినిమా కూడా త్వరలో రెడీ అవుతుంది.
ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాల పై ఉంటుందని అనుకుంటున్నారా?
సినిమా బాగుంటే, చూడాలనుకునే ఆడియన్స్ తప్పకుండా చూస్తారు. సినిమా మంచి కంటెంట్‌తో ఉంటే ఐపీఎల్ పెద్దగా ప్రభావం చూపదని నేను భావిస్తున్నాను.
విజయ్ సేతుపతికి కథ చెప్పే విషయంపై?
విజయ్ సేతుపతి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.మేము ఇంకా పరిశ్రమలో స్థిరపడిన తర్వాత కథ చెప్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం.
మీకు ఎలాంటి కథలు ఇష్టం?
నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం.ప్రస్తుత సమస్యలను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పే కథలు ఇష్టం.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్.ఫ్యూచరిస్టిక్ జానర్ ఆడియన్స్‌కు కొత్త అనుభూతి ఇస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









