ఘనంగా జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ & కావ్య రెడ్డి నిశ్చితార్థం
- April 07, 2026
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.
నిశ్చితార్థ వేడుకలో సాయి- కావ్య జంట తమ ప్రత్యేక బంధాన్ని ప్రతిబింబించేలా కస్టమైజ్డ్ జువెలరీను ధరించారు. ఆ అందాన్ని మరింత పెంచుతూ వారి ఎంగేజ్‌మెంట్ లుక్స్‌ను ఢిల్లీకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ డిజైన్ చేశారు. సంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు, నెటిజన్లు సాయి- కావ్య జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సాయి శ్రీనివాస్ & కావ్య రెడ్డి వివాహ వేడుకకు శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు.
వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







