సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- April 08, 2026
రియాద్ః సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాల్లో ఈ సంవత్సరం సాధారణ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వేసవి కాలానికి సంబంధించిన జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) తెలిపింది.ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల వెస్ట్, సౌత్ వెస్ట్ మరియు సౌత్ ప్రాంతాలలోని కొన్ని భాగాలలో ఒకటి నుండి రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్టు NCM ప్రతినిధి హుస్సేన్ అల్-కహ్తానీ వెల్లడించారు. మిగిలిన ప్రాంతాలలో మాత్రం ఈ పెరుగుదల అంతకంటే తక్కువగా ఉండోచ్చని పేర్కొన్నారు. అయితే, సౌదీలో వేసవి కాలం ముందుగానే ప్రారంభమవుతుందని సూచించే ఎటువంటి వాతావరణ సూచికలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ నెలాఖరు నుండి వరుసగా రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు సగటు స్థాయి కంటే తక్కువగా ఉంటాయని, ఆ తర్వాత వచ్చే ఒక వారంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని అల్-కహ్తానీ వివరించారు. వాతావరణ మార్పులకు సంబంధించి ముందస్తు సన్నద్ధతకు మరియు సరైన రీతిలో స్పందించడానికి NCM జారీ చేసే అధికారిక సమాచారం ఎంతో కీలకమని, ప్రజలందరూ తప్పక అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







