KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- April 08, 2026
కువైట్ః నగదు లావాదేవీలకు సంబంధించిన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక సేవా రంగాలలో 10 కువైట్ దినార్లకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బూడాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగదు స్థానంలో బ్యాంకింగ్ లేదా ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని ఆదేశించారు.
"2026 నాటి మంత్రిత్వ శాఖ నిర్ణయం నెం. 32 ప్రకారం.. ఆరోగ్య సంస్థలు, పురుషుల మరియు మహిళల సెలూన్లు, పిల్లల సెలూన్లు, స్పోర్ట్స్ క్లబ్లు, కీటకాలు మరియు ఎలుకల నియంత్రణ సేవలు, అలాగే ప్రజారోగ్య పురుగుమందుల దిగుమతి, ఎగుమతి మరియు నిల్వలో నిమగ్నమైన వ్యాపారాలకు వర్తిస్తుంది." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా ఉత్తర్వుల్లోని ఆర్టికల్ 1 ప్రకారం.. కాంట్రాక్టులు, అమ్మకాలు లేదా సేవల కోసం 10 కువైట్ దినార్లకు మించిన నగదు చెల్లింపులను నిషేధిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిమితిని మించిన ఏదైనా మొత్తాన్ని, వర్తించే నిబంధనలకు అనుగుణంగా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థల ద్వారానే ప్రాసెస్ చేయాలి.
ఆర్టికల్ 2, 1979 నాటి చట్టం నెం. 10 .. ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నిర్దేశిస్తుంది. వీటిలో, తప్పు చేసిన సంస్థను మూసివేయడం మరియు చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేయడం వంటివి ఉంటాయి.ఈ కొత్త నిబంధన, అధికారిక గెజెట్లో ప్రచురించిన నాటి నుంచి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







