చైతూ, రష్మికలకు INCA పురస్కారాలు
- April 09, 2026
టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్‌ను అనుభవిస్తున్నారు. ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, వరుసగా ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ‘గద్దర్ పురస్కారం’ అందుకున్న చైతూ, ఇప్పుడు ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) పురస్కారాల్లోనూ ఉత్తమ నటుడిగా నిలిచారు.
దేశంలోని 12 సినీ పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈనెల 16న ముంబైలో INCA అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది.’తండేల్’ చిత్రంలో అద్భుతమైన నటనకు గానూ నాగచైతన్య ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.’ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో నటనకు గానూ రష్మిక మందన్నా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. గద్దర్ పురస్కారాల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వేదికపై అవార్డులు అందుకోవడం విశేషం.
ఇక ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు విభాగంలో తెలుగు నుంచి రామ్ జగదీష్ కోర్టు చిత్రానికి ఎంపికయ్యారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మిరాయ్ విజేతగా నిలిచింది. ఉత్తమ హాస్య నటుడిగా మాస్టర్ రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం) అవార్డ్ అందుకోనున్నారు. ఇక తమిళం నుంచి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ (కాంత), ఉత్తమ నటిగా సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ), ఉత్తమ దర్శకుడిగా మారి సెల్వరాజ్ (బైసన్) ఉత్తమ చిత్రంగా టూరిస్ట్ ఫ్యామిలీ విజేతలుగా నిలిచాయి.
కన్నడలో కాంతార చాప్టర్ 1 సినిమాకు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటిగా రుక్మిణి వసంత్, ఉత్తమ చిత్రంగా కాంతార చిత్రాలు నిలిచాయి. ఇక మలయాళంలో ఉత్తమ నటుడిగా సర్వమ్ మాయ సినిమాకు నివిన్ పౌలీ, ఉత్తమ సినిమాగా లోకా చాప్టర్ 1, ఉత్తమ నటిగా కళ్యాణి ప్రియదర్శన్ నిలిచాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా డొమినిక్ అరుణ్ పురస్కారం అందుకోనున్నారు. హిందీలో ధురంధర్ సినిమాకు ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్, ఉత్తమ నటిగా హక్ సినిమా యామీ గౌతమ్ ధర్ నిలిచారు. ఉత్తమ చిత్రం ఛావా కాగా.. ధురంధర్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ అవార్డ్ అందుకోనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







